Saturday, January 18, 2025
HomeసినిమాKalki: 'కల్కి' కోసం ప్రభాస్ ఆ డేట్ ఫిక్స్ చేశారా?

Kalki: ‘కల్కి’ కోసం ప్రభాస్ ఆ డేట్ ఫిక్స్ చేశారా?

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనితో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ తో అంచనాలు అమాంతం పెరిగాయి. ఇది టాలీవుడ్.. బాలీవుడ్ మూవీ కాదు.. హాలీవుడ్ మూవీ అనే టాక్ తెచ్చుకుంది. దీంతో కల్కి ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆసక్తి అందరిలో నూ నెలకొంది.

ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా గతంలో ప్రకటించారు. ఆ తర్వాత సంక్రాంతికి రావడం లేదు.. సమ్మర్ లో వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వచ్చింది. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఓ ఇంటర్ వ్యూలో కల్కి మూవీ గురించి మాట్లాడుతూ.. సమ్మర్ కి వస్తుందని చెప్పడం జరిగింది. టీజర్ లో కూడా 2024లో రిలీజ్ అని ప్రకటించారు కానీ.. డేట్ ప్రకటించకపోవడంతో రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. ఈ మూవీ టీజర్ చూసిన రాజమౌళి సైతం రిలీజ్ ఎప్పుడు అని సోషల్ మీడియా వేదికగా అడిగారంటే.. ఈ సినిమా గ్లింప్స్ ఎంతగా ఇంట్రస్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే.. వైజయంతీ మూవీస్ సంస్థలో మరచిపోలేని చిత్రాల్లో ఒకటి జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా మే 9న రిలీజైంది. అదే డేట్ లో మహానటి రిలీజైంది. ఈ రెండు చిత్రాలు వైజయంతీ సంస్థకు మంచి పేరు తీసుకువచ్చాయి. ఎప్పటికీ మరచిపోలేని చిత్రాలుగా నిలిచాయి. అందుచేత ఇప్పుడు సెంటిమెంట్ గా కల్కి చిత్రాన్ని కూడా మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్