Saturday, January 18, 2025
Homeసినిమాప్రభాస్ టైటిల్ కి అంత డిమాండ్ చేశారా..?

ప్రభాస్ టైటిల్ కి అంత డిమాండ్ చేశారా..?

ప్రభాస్, రాజమౌళిల కాంబినేషన్లో రూపొందిన చిత్రాల్లో ఒకటి ‘ఛత్రపతి’. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ప్రభాస్ కి భారీగా మాస్ ఇమేజ్ తీసుకువచ్చిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం విశేషం. అయితే.. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి అది కూడా వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారని తెలిసి ఈ సినిమా పై ఆసక్తి ఏర్పడింది.

అయితే.. ఎప్పుడో ఈ రీమేక్ మూవీ ప్రారంభమైంది ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా..?  ఆగిపోయిందా..? అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మే 5న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇన్నాళ్లు ఎందుకు ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇవ్వలేదంటే కారణం టైటిల్ అని తెలిసింది. అవును.. ఈ సినిమాకి టైటిల్ ఛత్రపతి అని పెట్టాలని ఫిక్స్ అయ్యారట. అయితే.. హిందీలో ఈ టైటిల్ వేరే నిర్మాత దగ్గర ఉందట. ఆ టైటిల్ కోసం విశ్వప్రయత్నాలు చేశారట. పెద్ద పెద్ద వాళ్లతో ఫోన్ చేయించినా నో చెప్పారట.

అయితే ఆ నిర్మాత‌తో సంప్ర‌దిస్తే టైటిల్ రూపేణా గుడ్ విల్ దాదాపు 2 కోట్లు అడిగిన‌ట్టు టాక్‌. టైటిల్ కోసం అంత ఎందుకివ్వాలి? అంటూ నిర్మాత‌లు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. భారీ రిక‌మెండేష‌న్లు చేయించినా, స‌ద‌రు నిర్మాత టైటిల్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌లేదు. చివ‌రికి ఆ నిర్మాత అడిగిన రెండు కోట్లూ ఇచ్చి టైటిల్ కొనుక్కొన్న‌ట్టు టాక్‌ వినిపిస్తోంది. ఛ‌త్ర‌ప‌తి సినిమా హిందీలో హుకూమ‌త్‌కీ జంగ్ పేరుతో యూ ట్యూబ్ లో అందుబాటులో ఉంది. దాన్ని ఇప్ప‌టికే ల‌క్ష‌ల‌ మంది చూసేశారు. మరి.. బెల్లంకొండ శ్రీనివాస్, వినాయక్ చేసిన ఛత్రపతి ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్