Sunday, January 19, 2025
HomeసినిమాPrabhas: అసలు ప్రభాస్ ప్లాన్ ఏంటి..?

Prabhas: అసలు ప్రభాస్ ప్లాన్ ఏంటి..?

ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు చేశాడు కానీ.. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే.. ‘ఆదిపురుష్‌’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’, మారుతితో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగతో సినిమా.. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇంకా ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ వెయిటింగ్ లో ఉన్నారు. దీంతో ప్రభాస్ ప్లాన్ ఏంటి..? అసలు షూటింగ్ లో ఉన్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది ఆసక్తిగా మారింది.

ఇంతకీ విషయం ఏంటంటే… ఆదిపురుష్ మూవీ ప్రమోషన్స్ ను త్వరలో స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 16న విడుదల చేయనున్నారు. ఆతర్వాత సలార్ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఆదిపురుష్, సలార్ తర్వాత ప్రాజెక్ట్ కే సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే… ఈ సినిమాలతో పాటు మారుతి సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఏమాత్రం గ్యాప్ దొరికినా ప్రభాస్ ఈ సినిమా షూట్ లో జాయిన్ అవుతున్నారు.

మిగిలిన వారి వర్కింగ్ స్టయిల్ కు మారుతి వర్కింగ్ స్టయిల్ కు తేడా వుంది. ఎలా వుంటే అలా నడిపించడంలో ఆయన ముందు వుంటారు. ఇలాగే వుండాలి. ఇలాగే చేయాలి అని గీసుకుని కూర్చోరు. అందుకే షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతుంది. ఎంటర్ టైనింగ్ గా ఉండే క్యారెక్టర్ కావడంతో ప్రభాస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేస్తున్నాడట. డిసెంబర్ నాటికి ఈ సినిమా పూర్తవ్వాలనేది టార్గెట్. వచ్చే సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుచేత డిసెంబర్ నాటికి ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి ఆతర్వాత కొత్త సినిమాలు స్టార్ట్ చేస్తాడని.. ఇదే ప్రభాస్ ప్లాన్ అని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్