Monday, June 17, 2024
Homeసినిమా'ప్రాజెక్ట్ కే' స్టోరీ ఇదే

‘ప్రాజెక్ట్ కే’ స్టోరీ ఇదే

ప్రభాస్,నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జంటగా దీపికా పడుకునే నటిస్తుంటే.. కీలక పాత్రలో అమితాబ్ నటిస్తుండడం విశేషం. అయితే.. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ప్రాజెక్ట్ కే అంటే ఏంటి..? అసలు ఇది ఏ జోనర్ మూవీ..? అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది.

అయితే.. ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ ఓ స్టోరీ బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే… అప్పుడెప్పుడో… 2012 అనే ఓ హాలీవుడ్ మూవీ వ‌చ్చింది. యుగాంతానికి సంబంధించిన ఫిక్ష‌న‌ల్ స్టోరీ అది. ఈ ప్ర‌పంచం అంత‌మైపోతే.. ఎలా ఉంటుంది? అస‌లు ఏమ‌వుతుంది? అనే పాయింట్ తో తెరకెక్కిన సినిమా.  అప్ప‌ట్లో యుగాంతం గురించి కూడా మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. వాటి స్ఫూర్తితో రాసుకొన్న క‌థ అది. అయితే.. ఆ త‌ర్వాత ఎవ‌రూ యుగాంతం క‌థని ముట్టుకోలేదు. అయితే ప్రాజెక్ట్ కే క‌థ యుగాంతానికి సంబంధించింది అని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా టైమ్ ట్రావెల్ చుట్టూ తిరుగుతుంద‌ని ఇది వ‌ర‌కు ఊహాగానాలు వ‌చ్చాయి. ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఓ గైడ్ లా వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరో విషయం ఏంటంటే.. ప్రాజెక్ట్ కే లో కే అంటే క‌ల్కి. క‌లియుగం కల్కి అవ‌తారంతోనే అంతం అవుతుంది. ప్ర‌భాస్ పాత్ర క‌ల్కిని పోలి ఉంటుందని తెలిసింది. అయితే.. పురాణాల ట‌చ్ ఎక్క‌డా ఉండ‌దు. అండ‌ర్ క‌రెంట్‌లో ఆ పాత్ర‌లు తెర‌ పై క‌నిపిస్తాయి అంతే అంటున్నారు. మరి.. ఈ పాన్ వరల్డ్ మూవీ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read : స్పీడో మీటర్ కు -‘ప్రాజెక్ట్ కే’ కు లింకేంటి?

RELATED ARTICLES

Most Popular

న్యూస్