Sunday, January 19, 2025
Homeసినిమాసంక్రాంతికి వస్తున్న ‘రాధేశ్యామ్’

సంక్రాంతికి వస్తున్న ‘రాధేశ్యామ్’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమా కథలో ప్రభాస్ విక్రమాదిత్యగా నటిస్తే.. పూజా హేగ్డే ప్రేరణగా నటించారు.  ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.  ఈ భారీ చిత్రాన్ని ఎప్పుడో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా వాయిదా పడుతూనే ఉంది.

ఇటీవల బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేశారు. దీంతో ‘రాధేశ్యామ్’ షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. 2022 జనవరి 14న సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ప్రకటించి న్యూపోస్టర్ రిలీజ్ చేశారు. ఈ భారీ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్