Sunday, January 19, 2025
Homeసినిమాబాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న'సలార్'

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న’సలార్’

ప్రభాస్ అభిమానులే కాకుండా..  కామన్ ఆడియన్స్ సైతం ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా సలార్. ఈ భారీ చిత్రానికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతిహాసన్ నటించింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి సలార్ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్‌ 2 బ్లాక్ బస్టర్ అవ్వడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రేక్షకాభిమానుల్లో ఉన్న అంచనాలకు దీటుగా సలార్ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెలాఖరు నుంచి ఓపెన్ చేస్తారనుకుంటే.. యు.ఎస్ లో సడన్ గా బుకింగ్స్ ఓపెన్ చేసి షాక్ ఇచ్చారు. అయితే.. ఇలా బుకింగ్స్ ఓపెన్ చేసారలో లేదో అలా రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటలోనే లక్ష డాలర్లకు పైగా వసూలు చేసింది. సోషల్ మీడియాలో సలార్ టిక్కెట్లు బుక్ చేసుకున్నామంటూ నెటిజన్లు పోస్టులు పెట్టడం వైరల్ అయ్యింది. ఇక ట్రైలర్ ను ఈ నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ కు ఏ రేంజ్ లో రియాక్షన్ రానుందో అనేది ఆసక్తిగా మారింది.

ఇక సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సలార్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. అందుకనే అభిమానులే కాకుండా… ప్రభాస్ కూడా సలార్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం ఖాయం అని గట్టిగా నమ్ముతున్నాడు. ప్రశాంత్ నీల్ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 28న సలార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్