Saturday, January 18, 2025
Homeసినిమాప్రభాస్ జీవితంలోకి ఎంటర్ అవుతున్న ప్రత్యేక వ్యక్తి

ప్రభాస్ జీవితంలోకి ఎంటర్ అవుతున్న ప్రత్యేక వ్యక్తి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడా? ఆయన కుటుంబంతో పాటు అభిమానుల ఎదురుచూపులు త్వరలోనే ఫలించబోతున్నాయా? ఈ ప్రశ్నలకు ప్రభాస్ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో పెట్టిన ఓ పోస్ట్ సమాధానం చెప్పినట్లయ్యింది. త్వరలోనే ఆయన పెళ్ళికి సంబంధించిన అధికారిక సమాచారం రానుంది.  కృష్ణంరాజు మరణించక ముందే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని, పెదనాన్న చివరి కోరిక తీరుస్తాడని అందరూ అనుకున్నా అప్పట్లో అది సాధ్యపడలేదు.

ప్రభాస్  నేడు చేసిన పోస్ట్ ఓ గుడ్ న్యూస్ ను అభిమానులకు పంచినట్లయ్యింది. ‘అతి త్వరలో ఓ ప్రత్యేక వ్యక్తి మన జీవితంలోకి ఎంటర్ కాబోతుంది, వెయిట్ చేయండి’ అంటూ ప్రభాస్ వెల్లడించాడు. ఈ వార్త సంచలనంగా మారింది. అమ్మాయి ఎవరు, సినిమా రంగానికి చెందినవారా, బయటి వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నాడా అనే కుతూహలం పెంచారు.  త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు కుటుంబ సభ్యులు వెల్లడిస్తారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్