Saturday, January 18, 2025
Homeసినిమామరోసారి టీ సిరీస్ బ్యానర్లో ప్రభాస్! 

మరోసారి టీ సిరీస్ బ్యానర్లో ప్రభాస్! 

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన పాన్ ఇండియా సినిమాలలో కొన్ని డీలాపడినా, ఆయనక్రేజ్ .. మార్కెట్ ఎంతమాత్రం తగ్గడం లేదు. అదే జోష్ తో ఆయన ముందుకు వెళుతున్నాడు. ఆయన నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘కల్కి’ సినిమా రెడీ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. ఇక ఆ తరువాత ‘రాజా సాబ్’ వంటి మరికొన్ని ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి టీ సిరీస్ వారు రంగంలోకి దిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన భారీ పారితోషికంతో ప్రభాస్ కి అడ్వాన్స్ ముట్టిందని అంటున్నారు. ఆల్రెడీ ప్రభాస్ ఈ బ్యానర్ లో ఇంతకుముందు ‘ఆదిపురుష్’ సినిమా చేశాడు. మళ్లీ ఆయనతో ఓ సినిమా చేయడానికి టీ సిరీస్ సిద్ధమైంది. ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కథ ఒకటి సిద్ధార్థ్ ఆనంద్ దగ్గర ఉంది.

ఒకవేళ ప్రభాస్ కమిట్ మెంట్స్ కారణంగా సిద్ధార్థ్ ఆనంద్ ప్రాజెక్టును చేయడానికి చాలా సమయం పడితే, ఆల్రెడీ ప్రభాస్ ఒప్పుకున్న సినిమాకి టీ సిరీస్ వారు నిర్మాతలుగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అంటే ప్రభాస్ ఒప్పుకున్న సినిమాను చేయడానికి టీ సిరీస్ రెడీగా ఉందన్న మాట. సిద్ధార్థ్ ఆనంద్ ప్రాజెక్టునే ముందుగా పట్టాలపైకి తీసుకుని వెళ్లాలని ప్రభాస్ అనుకుంటే గొడవేలేదన్న మాట. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్