Sunday, January 19, 2025
HomeసినిమాPrabhas: ప్రభాస్ నయా టార్గెట్ ఇదే..?

Prabhas: ప్రభాస్ నయా టార్గెట్ ఇదే..?

బాహుబలి సినిమాతో సంచలనం సృష్టించాడు.. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. తనకు వచ్చిన ఇమేజ్ కు తగ్గట్టుగానే పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. అయితే.. బాహుబలి తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో ఈసారి ఎలాగైనా సరే.. సక్సెస్ సాధించాలని పట్టుదలతో వర్క్ చేస్తున్నాడు. జూన్ 16న ‘ఆదిపురుష్’ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రభాస్ రాముడుగా నటిస్తే.. కృతి సనన్ సీతగా నటించింది. సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటించారు.

ఇదిలా ఉంటే.. బాహుబలి సినిమాతో 1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన ప్రభాస్ ఇప్పుడు మళ్లీ ఆ క్లబ్ లో చేరాలని తపిస్తున్నాడు. ఈసారి వరుసగా సినిమాలతో 1000 కోట్ల వసూలు చేసి భారతదేశంలోనే నంబర్ -1 స్టార్ తానేనని నిరూపించుకోవాలి అనుకుంటున్నాడట. అతడి సినిమాలన్నీ భారీ బడ్జెట్ల తో తెరకెక్కడమే గాక పాన్ వరల్డ్ రిలీజ్ కి వెళ్లడం సంచలనం కానుంది. ఆదిపురుష్ 500 కోట్లతో రూపొందింది. 1000 కోట్ల వసూళ్ల లక్ష్యంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా పై 500కోట్లు పైగానే వ్యాపారం జరగనుంది.

అలాగే ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సలార్’ పై 350కోట్ల బడ్జెట్ పెడుతుండగా దాదాపు 1000 కోట్లు పైగా వసూలు చేయాలనే లక్ష్యంతో ప్రతిదీ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక ప్రభాస్, నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్-కే’ చేస్తున్నారు. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారని పాన్ వరల్డ్ మార్కెట్లో 1500 కోట్ల వసూళ్ల లక్ష్యంతో ఈ సినిమాని అత్యంత భారీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇలా ప్రభాస్ తన సినిమాలతో 1000 కోట్ల వసూలు సాధించాలి అనుకుంటున్నాడు. మరి.. ప్రభాస్ టార్గెట్ రీచ్ అవుతాడో లేదో చూడాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్