Saturday, January 18, 2025
Homeసినిమాఅందుకే ప్రభాస్ అలా ప్లాన్ చేశాడట!

అందుకే ప్రభాస్ అలా ప్లాన్ చేశాడట!

ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. దాంతో ఒక్కో సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడానికీ .. ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం తీసుకుంటోంది. అంతగా కాలాన్ని ఖర్చు చేస్తూ చేసిన సినిమా ఫలితం నిరాశ పరిస్తే, మరో సినిమా థియేటర్లకు రావడానికి చాలా సమయం పడుతోంది. ‘సాహో’ .. ‘రాధేశ్యామ్’ వంటి సినిమాల విషయంలో ప్రభాస్ అభిమానులు చాలా అసహనానికీ .. అసంతృప్తికి లోనవ్వడానికి కారణం ఇదే.

‘రాధే శ్యామ్’ ఫ్లాప్ తరువాత ప్రభాస్ నుంచి మరో సినిమా ఇప్పట్లో వచ్చే  అవకాశం లేదు. ‘ఆది పురుష్’ .. ‘సలార్’ .. ‘ప్రాజెక్టు K’ వంటి ప్రాజెక్టులు చేతిలో ఉన్నప్పటికీ, అవి ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తాయనేది తెలియదు. అభిమానులతో గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతోనే ప్రభాస్ ఓ మాదిరి బడ్జెట్ లోను సినిమాలను కూడా చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇకపై పెద్ద సినిమాల మధ్యలో మీడియం బడ్జెట్ సినిమా ఒకటి చేసే ఛాన్స్ లేకపోలేదు. అలా చేయడం వలన అభిమానులతో గ్యాప్ పెరగకుండా ఉంటుందనేది ఆయన ఆలోచన.

అందువల్లనే దర్శకుడు మారుతితో ఒక సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా చాలా రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుందనీ, మూడో షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 27వ తేదీ నుంచి మొదలెట్టనున్నారనేది తాజా సమాచారం. ప్రభాస్ తో పాటు నిధి అగర్వాల్ .. మాళవిక మోహనన్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని అంటున్నారు. హారర్ కామెడీ జోనర్లో సాగే ఈ సినిమాను, ‘దసరా’కి విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్