Sunday, January 19, 2025
Homeసినిమా18న ప్రభాస్‌ 'యోగి' రీ రిలీజ్‌

18న ప్రభాస్‌ ‘యోగి’ రీ రిలీజ్‌

ప్రభాస్‌, నయనతార జంటగా వినాయక్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘యోగి’ 2007వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ప్రభాస్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. పి. రవీంద్రనాథ్‌రెడ్డి సమర్పణలో ఈశ్వరి ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై సుదర్శన్‌రెడ్డి, చంద్ర ప్రతాప్‌రెడ్డిలు నిర్మించారు. రమణగోగుల సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి.

తాజాగా ఈ చిత్రాన్ని చందు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై లింగం యాదవ్‌ రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఇందుకోసం ఈ చిత్రాన్ని 4కె ఫార్మట్‌లోకి మార్చారు. దిల్‌రాజు, శిరీష్‌ల సహకారంతో ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు మరోసారి రాబోతున్న సందర్భంగా ఈ చిత్రం రీ రిలీజ్‌ టైలర్‌, పోస్టర్‌లాంచ్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగీత దర్శకుడు రమణ గోగుల విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్‌, పోస్టర్‌ను లాంచ్‌ చేశారు.

ఈ సందర్భంగా రమణ గోగుల మాట్లాడుతూ… అందరూ అన్నట్టుగా నేను మళ్లీ బ్యాక్‌ అవుతాను. టెక్నాలజీని వాడుకుని ఈ సినిమాను మంచి క్వాలిటీతో తీసుకొస్తున్నారు. సౌండ్‌ చాలా బాగా వచ్చింది. ఇంత కష్టపడిన టీం అందరికీ అభినందనలు. తప్పకుండా ఈ రీ రిలీజ్‌ మంచి లాభాలు తీసుకొస్తుందని నమ్ముతున్నా అన్నారు.

లింగం యాదవ్‌ మాట్లాడుతూ… మా ఈ రీ రిలీజ్‌ ఈవెంట్‌కు విచ్చేసిన రమణ గోగుల గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రభాస్‌ గారి అభిమానులకు ఓ అద్భుతమైన ట్రీట్‌గా ఈ చిత్రాన్ని మంచి క్వాలిటీతో విడుదల చేయాలని నేను సంకల్పించుకున్నాను. సహజంగా నేను ఎగ్జిబిటర్‌ కావడంతో సినిమా క్వాలిటీపై మంచి అవగాహన ఉంది. అందుకే చాలా కష్టపడి ఈ సినిమాను 4కె ఫార్మట్‌లోకి మార్చాము. రమణ గోగుల గారు అందించిన సంగీతం, వినాయక్‌ గారి దర్శకత్వ ప్రతిభ, సుదర్శన్‌రెడ్డి, చంద్ర ప్రతాప్‌రెడ్డి గార్ల రాజీలేని నిర్మాణ విలువలు ఈ సినిమాను గొప్పగా తీర్చిదిద్దాయి. రీరిలీజ్‌లో కూడా ఇది సూపర్‌హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా విషయంలో నా గురువులు దిల్‌రాజుగారు, శిరీష్‌ గారు అండగా నిలిచి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. అలాగే నా మిత్రడు నవీన్‌చంద్రరాజు గారు, మాధవిగారు ఈ ప్రాజెక్ట్‌ అనుకున్న దగ్గర నుంచి నాకు తోడుగా ఉన్నారు. వినాయక్‌ గారు, దిల్‌రాజు గారు కూడా ఈ ఈవెంట్‌కు రావాల్సింది. అయితే అనివార్య కారణాలవల్ల వారు రాలేకపోయారు. ఈనెల 18న సుదర్శన్‌ థియేటర్‌లో అందరం కలిసి సినిమా చూస్తాం. ఇప్పటికే ఆన్‌లైన్‌లో బకింగ్‌లు సూపర్‌గా అవుతున్నాయి అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి మాధవి, డిస్ట్రిబ్యూటర్స్‌ రమేష్‌, అచ్చిబాబు, రఘురామరెడ్డి, అక్సాఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. యు మీడియా కల్యాణ్‌ సుంకర ఈవెంట్‌ ఆర్గనైజ్‌ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్