Sunday, November 24, 2024
HomeTrending Newsప్రగతి భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు

ప్రగతి భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు

74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్ లో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి సీఎం పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ అనంతరం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో అమర జవానుల స్మారక స్థూపం వద్దకు వెళ్లి జ్యోతి ప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశం కోసం అమర జవానుల త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, శంభీపూర్ రాజు, మధుసూధనా చారి, సీఎస్ శాంత కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఎంఓ ఉన్నతాధికారులు, సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్