Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ఇండోనేసియా ఓపెన్: ప్రన్నోయ్ ఒక్కడే!

ఇండోనేసియా ఓపెన్: ప్రన్నోయ్ ఒక్కడే!

Indonesia Open: ఇండోనేసియా ఓపెన్ – 2022 లో ఇండియా నుంచి హెచ్ ఎస్ ప్రన్నోయ్ ఒక్కడే బరిలో మిగిలాడు. నేడు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో హాంగ్ కాంగ్ ఆటగాడు అంగుస్ లాంగ్ పై 21-11; 21-18 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్ ఫైనల్స్ లో  పెట్టాడు.

మహిళల సింగల్స్ లో సింధు, పురుషుల్లో లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్ లు తొలి రౌండ్ లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

నేడు జరిగిన మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో సమీర్ వర్మ 21-10;21-13 తేడాతో మలేషియా ఆటగాడు లీ జీ జియా చేతిలో ఓటమి పాలయ్యాడు.

నేడు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ ల్లో మహిళల డబుల్స్ లో పొన్నప్ప- సిక్కీ రెడ్డి జోడీ; పురుషుల డబుల్స్ లో ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల ద్వయం తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్