Monday, February 24, 2025
HomeTrending Newsఏపీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

ఏపీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రెండు కీలక బిల్లులను భారత రాష్ట్రపతి గురువారం ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కమిషన్‌, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి  రెండు వేర్వురు కమిషన్లు ఏర్పాటును ప్రతిపాదిస్తూ బిల్లు తీసుకొచ్చారు. ఎస్సీ కమిషన్‌కు సంబంధించిన బిల్లును ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ గతేడాది జనవరిలో ఆమోదించింది.  అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు శానసమండలి కొన్ని సవరణలు చేసి వెనక్కు పంపింది. అయితే ఆ సిఫార్సులు ఆమోదయోగ్యం కావన్న శాసన సభ.. బిల్లును జనవరి, 2020 లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో యథాతథంగా ఆమోదించింది. ఇప్పుడు ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో త్వరలోనే ఏపీలో ప్రత్యేక ఎస్సీ కమిషన్‌ అందుబాటులోకి రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్