Sunday, January 19, 2025
HomeTrending NewsMemorial Coin: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల

Memorial Coin: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల

నటరత్న,  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు  శతజయంతి సందర్భంగా  కేంద్ర ప్రభుత్వం ఆయన ఫోటోతో  రూపొందించిన 100 రూపాయల స్మారక నాణేన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.

రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమమంలో వేదికపై ఎన్టీఆర్ కుమారులు మోహన కృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ…. కుమార్తెలు దగ్గుబాటి పురంధేశ్వరి, లోకేశ్వరి, భువనేశ్వరిలు రాష్ట్రపతితో కలిసి కూర్చున్నారు.

వేదిక ఎదురుగా ఏర్పాటు చేసిన అతిథుల సీట్లు  మొదటి వరుసలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ ఎంపి రఘురామ కృష్ణంరాజులు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కూర్చున్నారు.

ఈ సందర్భంగా బాబు-నడ్డాలు ముచ్చటించుకోవడం కనిపించింది.  సభ ప్రారంభానికి ముందు  కూడా వీరందరూ కలిసి తేనీరు సేవించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్