Monday, May 5, 2025
HomeTrending Newsరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలే కీలకం

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలే కీలకం

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ.. ఆట ఇంకా అయిపోలేదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బడ్జెట్ చర్చ సందర్భంగా అసెంబ్లీలో బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. కొందరు కావాలనే ప్రతి విషయాన్ని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించండం అంత సులభం కాదని హెచ్చరించారు. దేశంలో మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో సగం కూడా బీజేపీకి లేవని, ఈ నేపథ్యంలో గత రాష్ట్రపతి ఎన్నికల మాదిరి ఈసారి అంత సులభం కాదని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటమిపాలైనప్పటికీ గతంతో పోల్చితే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని గుర్తుచేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య అధికంగానే ఉందని తెలిపారు. దేశంలోని ఎమ్మెల్యేల్లో బీజేపీకి స‌గం మంది ఎమ్మెల్యేలు కూడా లేర‌ని చుర‌క అంటించారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి గెల‌వాలంటే త‌మ మ‌ద్ద‌తు తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి బీజేపీకి ఎదురు కానుంద‌ని ఆమె వ్యాఖ్యానించారు.

Also Read : పీసీసీ అధ్యక్షుల రాజీనామాకు ఆదేశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్