Sunday, January 19, 2025
HomeTrending Newsశ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక పూజలు

శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక పూజలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కర్నూలు జిల్లా శ్రీశైలంలో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్న రాష్ట్రపతికి ఏపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి శ్రీశైలం ప్రధానాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రత్నగర్భ గణపతి స్వామిని ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను రాష్ట్రపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేశారు. మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.

సున్నిపెంట హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన సాక్షి గణపతి ఆలయానికి బయల్దేరి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం భ్రమరాంబిక గెస్ట్‌హౌజ్‌కు వెళ్లారు. కొద్ది సేపు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబిక దేవికి కుంకుమార్చన, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ’ప్రసాద్‌’ పథకంలో భాగంగా శ్రీశైలం దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకొని తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్