Sunday, November 24, 2024
HomeTrending Newsపెరూ దేశానికి తొలి మ‌హిళ దేశాధ్య‌క్షురాలు

పెరూ దేశానికి తొలి మ‌హిళ దేశాధ్య‌క్షురాలు

అమెరికా పన్నాగానికి దక్షిణ అమెరికా ఖండంలో మరో ప్రభుత్వం మారింది. పేరు దేశానికి అధ్యక్షుడుగా ఉన్న పెడ్రో కాస్టిల్లోని గద్దె దింపే వరకు అమెరికా నిద్ర పోలేదు. వమాపక్ష బావజాలం కలిగిన పెడ్రో కాస్టిల్లో…ఆ దేశ కాంగ్రెస్ లో విపక్షాల ఆధిపత్యం పెరిగి కొత్త చట్టాలు చేయలేకపోతున్నారు. పెడ్రో కాంగ్రెస్ రద్దు ప్రకటన చేయగానే అమెరికా పరోక్షంగా రంగంలోకి దిగి కథ నడిపించింది. దీంతో పెరూ దేశానికి తొలిసారి ఓ మ‌హిళ దేశాధ్య‌క్షురాలయ్యారు. దినా బొలార్టే బుధ‌వారం రాజ‌ధాని లిమాలో ప్ర‌మాణ స్వీకారం చేశారు. అధ్య‌క్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంస‌న ద్వారా తొల‌గించారు. ఈ నేప‌థ్యంలో ఉపాధ్య‌క్షురాలిగా ఉన్న దినా బొలార్టే అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో పెడ్రోను అభిశంస‌న త‌ర్వాత అరెస్టు చేశారు. మెక్సికో ఎంబ‌సీకి వెళ్తున్న స‌మ‌యంలో ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు.

దినా బొలార్టే వ‌య‌సు 60 ఏళ్లు. ఆమె ఓ లాయ‌ర్‌. జూలై 2026 వ‌ర‌కు తానే అధికారంలో ఉండ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు. రాజ‌కీయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏకాభిప్రాయాన్ని కుదుర్చుకోవాల‌ని ఆమె అన్నారు. కొంత స‌మ‌యం ఇస్తే దేశాన్ని కాపాడుతాన‌ని కొత్త అధ్యక్షురాలు భరోసా ఇచ్చారు.

పేరు రాజధాని లిమాలో బుధవారం చాలా నాట‌కీయంగా పెడ్రో తొల‌గింపు ప్ర‌క్రియ జ‌రిగింది. టీవీలో జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న దేశంలో అత్య‌యిక స్థితి ప్ర‌క‌టించారు. పెడ్రో తీరును ఆగ్ర‌హించిన ఎంపీలు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పారు. సుమారు 101 మంది నేత‌లు ఆయ‌న‌పై అభిశంస‌న ప్ర‌క‌టించాఋరు. ఆ త‌ర్వాత పెడ్రోను పోలీసులు అరెస్టు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్