తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారయ్యింది. ఫిబ్రవరి 13న మోడీ హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు.
వాస్తవానికి సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ట్రయిన్ ను ప్రారంభించడానికి ఈ నెల 19నే మోడీ తెలంగాణలో పర్యటించాల్సింది. అనివార్య కారణాలవల్ల టూర్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో అనుకున్న టైం కంటే ముందే ఈ నెల 15న సికింద్రాబాద్- వైజాగ్ వందేభారత్ ట్రయిన్ ను మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో ఇపుడు మోడీ టూర్ ఖరారయ్యింది.