Saturday, January 18, 2025
Homeసినిమాఅశోక్ గల్లా మూవీ పేరు 'హీరో'

అశోక్ గల్లా మూవీ పేరు ‘హీరో’

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ హీరోగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అమరరాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘హీరో’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ ను మహేష్ బాబు రిలీజ్ చేసి  మేనల్లుడికి ‘ఆల్ ద బెస్ట్’ చెప్పారు.

`హీరో` ఫస్ట్ లుక్ పోస్టర్లో ఫిట్‌ అండ్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు అశోక్. అలాగే స్టార్ సింబల్, గన్ను, బుల్లెట్, ఫిలిం రోల్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అశోక్ కౌబాయ్ గా ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ తో `హీరో` సినిమా టైటిల్ టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. అలాగే ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ మేజర్ హైలైట్ గా నిలవనుంద‌ని తెలుస్తోంది. కౌబాయ్ గా కనపడిన కాసేపటికే హీరో జోక‌ర్ గెట‌ప్‌లో క‌నిపించాడు. అశోక్-నిధి అగర్వాల్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. టైటిల్ టీజ‌ర్‌లో బ‌ట్టి చూస్తే  ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయ‌ని అర్ధ‌మ‌వుతుంది. ఇక జోక‌ర్‌లుక్‌లో అశోక్ గ‌ల్లా క‌న్నింగ్ స్మైల్ టీజ‌ర్‌కే హైలెట్ అని చెప్పొచ్చు.

ఒక నిమిషం నిడివిగ‌ల టైటిల్ టీజర్ తో హీరో అశోక్ తన ప్రతిభను చాటుకునే ప్రయత్నంలో విజయం సాధించారు. ఈ టైటిల్ టీజ‌ర్‌తో ప్రేక్షకుల మెప్పుపొందారు. అలాగే  శ్రీరామ్ ఆదిత్య మేకింగ్ స్టైల్ కి మంచి  ప్ర‌శంస‌లు దక్కుతున్నాయి. మంచి నిర్మాణ విలువలు, కెమెరామెన్ రిచర్డ్‌ ప్రసాద్‌ అద్భుతమైన పనితనం, జిబ్రాన్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లనున్నాయి. ‘హీరో’ సినిమా టైటిల్ టీజర్ ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లోనూ అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అంచనాలు పెంచేసింది.

జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చన సౌందర్య కీలక పాత్రధారులు పోషిస్తున్నారు. చంద్రశేఖర్ రావిపాటి ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్య‌వ‌హరిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘హీరో`మూవీ విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్