Sunday, January 19, 2025
Homeసినిమాస‌లార్ లో పృథ్వీరాజ్ పాత్ర ఏంటి?

స‌లార్ లో పృథ్వీరాజ్ పాత్ర ఏంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ డైరెక్ష‌న్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ సలార్. కేజీఎఫ్ నిర్మాతలే  దీన్ని కూడా నిర్మిస్తున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కొంత వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను అనుకున్నారు.

అయితే.. తన డేట్స్ సర్దుబాటు చేయలేని కారణంగా పృథ్వీరాజ్ స‌లార్ నుంచి త‌ప్పుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీని పై మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇది నిజ‌మే అనుకున్నారు. అయితే.. ఇటీవ‌ల స‌లార్ రిలీజ్ డేట్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ ను  పృథ్వీరాజ్ సుకుమారన్ కి ట్యాగ్ చేయడంతో, ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని.. ఆయన ఈ సినిమా చేస్తున్నార‌ని క‌న్ ఫ‌ర్మ్ అయ్యింది.

 పృధ్వీరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా న‌టిస్తున్నాడ‌ని కొంత మంది అంటుంటే, విలన్ గా కనిపించనున్నాడని మరి కొంతమంది చెబుతున్నారు. దీంతో ఆయ‌న క్యారెక్ట‌ర్ ఏంటి అనేది ఆస‌క్తిగా మారింది. ఈ రెండు పాత్రలలో ఆయన ఏ క్యారెక్ట‌ర్ చేయనున్నాడనేది తెలియవలసి ఉంది. వచ్చే సంవ‌త్స‌రం సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మ‌రి.. స‌లార్ మూవీతో ప్ర‌భాస్, ప్ర‌శాంత్ నీల్ ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్