Monday, May 20, 2024
Homeస్పోర్ట్స్ఎఫ్ఐహెచ్ లీగ్ తో ప్రత్యర్ధిపై అంచనా: మన్ ప్రీత్ సింగ్

ఎఫ్ఐహెచ్ లీగ్ తో ప్రత్యర్ధిపై అంచనా: మన్ ప్రీత్ సింగ్

జనవరిలో మొదలు కానున్న  హాకీ వరల్డ్ కప్ కు ముందు ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్.ఐ.హెచ్.) ప్రొ లీగ్ టోర్నీలో స్పెయిన్ తో ఆడడం ఎంతో ఉపయోగం ఉంటుందని భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్  అభిప్రాయపడ్డారు.  ఎఫ్ఐహెచ్ ప్రోలీగ్  మ్యాచ్ లు వరల్డ్ కప్ ముందు ప్రత్యర్ధిని అంచనా వేయడానికి ఓ అవకాశం ఇస్తుందని మన్ ప్రీత్ సింగ్ చెప్పాడు. కొన్ని అంశాల్లో జట్టు పనితీరు మెరుగు కావాల్సి ఉందని, యెల్లో కార్డులు పొందడం తగ్గించాలని సూచించాడు. మ్యాచ్ నుంచి ఒక్క ఆటగాడు దూరమైనా మైదానంలో ఉన్నవారు మరింత పరుగెత్తాల్సి ఉంటుందని చెప్పాడు.

2022-23 ఎఫ్.ఐ.హెచ్. ప్రొలీగ్ టోర్నీ అక్టోబర్ 28న ఒడిశా రాజధాని భువనేశ్వర్ కళింగ స్టేడియంలో మొదలైంది. ఆరంభ మ్యాచ్ లో ఇండియా న్యూజిలాండ్ పై 4-3తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఈ టోర్నీ తొలిదశ మ్యాచ్ ల్లో భాగంగా ఇప్పటికి నాలుగు మ్యాచ్ లు… న్యూజిలాండ్, స్పెయిన్ తో చెరో రెండు… ఆడిన ఇండియా మూడింటిలో విజయం సాధించింది. అక్టోబర్ 30న స్పెయిన్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో 3-2తేడాతో ఓటమి పాలైన ఇండియా మొన్న ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో 3-1(షూటౌట్) తో ఆధిక్యం ప్రదర్శించింది.  తొలిదశ మ్యాచ్ లు డిసెంబర్ 18వరకూ జరుగుతాయి. ఆ తరువాత ఫిబ్రవరి 28 నుంచి మొదలవుతాయి.

ఈ లోగా జనవరి 13నుంచి 29వరకూ ఓడిశాలోని కళింగ స్టేడియంతో పాటు ఇటీవలే కొత్తగా నిర్మించిన రూర్కెలా లోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో  వరల్డ్ కప్ హాకీ -2023 టోర్నమెంట్ జరగనుంది.

వరల్డ్ కప్ టోర్నీలో మొత్తం నాలుగు పూల్స్ ఉండగా… ఇండియా, ఇంగ్లాండ్, స్పెయిన్ , వేల్స్ జట్లు ఉన్నాయి. తోలురోజు ఇండియా-స్పెయిన్ జట్లు బిర్సా ముండా స్టేడియంలో తలపడనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్