Sunday, January 19, 2025
Homeఅంతర్జాతీయంరావల్పిండి రింగ్ రోడ్ పై విచారణ

రావల్పిండి రింగ్ రోడ్ పై విచారణ

రావల్పిండి రింగ్ రోడ్డు కుంభకోణంపై పాకిస్తాన్ లోని పంజాబ్ అవినీతి నిరోధక శాఖ విచారణ ప్రారంభించింది. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ జోహార్ ఈ విచారణకు నేతృత్వం వహిస్తుండగా, న్యాయ, సాంకేతిక, ఆర్థిక శాఖ నిపుణులు కూడా బృందంలో ఉన్నారు.

రావల్పిండి రింగ్ రోడ్ వ్యవహారం పాకిస్తాన్ లో రాజకీయంగా పెను దుమారం లేపింది. ఈ ప్రాజెక్టు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. కొందరు ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా అలైన్మెంట్ లో మార్పులు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాత్ర కూడా ఉందని విపక్షాలు ఆరోపించాయి.

ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మంత్రివర్గ సహచరులు రాజీనామా చేయాలని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రాధమిక నివేదికలో తన పేరు రావడంతో ప్రధానమంత్రి ప్రత్యేక సహాయకుడు జుల్ఫీ బుఖారి ఇప్పటికే పదవికి రాజీనామా చేశారు. విపక్షాల డిమాండ్ కు తలొగ్గిన ఇమ్రాన్ ఖాన్ ఈ అంశంపై విచారణ జరిపించాల్సిందిగా పంజాబ్ ముఖ్యమంత్ర్రి ఉస్మాన్ బుజ్దార్ కు సూచించారు.
ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపి త్వరలోనే వాస్తవాలు ప్రజలకు అందిస్తామని అవినీతి నిరోధక శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్