Sunday, January 19, 2025
Homeసినిమా'ఏజెంట్' నిర్మాత ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్

‘ఏజెంట్’ నిర్మాత ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్

అక్కినేని అఖిల్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఏజెంట్. ఈ భారీ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.

దర్శకుడు సురేందర్ రెడ్డికి కూడా ఆ ప్రాజెక్ట్ అత్యంత క్రూషియల్. మెగాస్టార్ తో చేసిన సైరా నరసింహారెడ్డి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో తన ఆశలన్నీ ఏజెంట్ పైనే పెట్టుకున్నాడు. అయితే.. తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ సినిమా పై అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది.  దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఏజెంట్ వ‌స్తుందా అని రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా వుంటే.. తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఏజెంట్ గురించి ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేయ‌డం ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే… ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ప్రతి హీరో తనని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంటారు. ఏజెంట్ అఖిల్ కు అలాంటి సినిమా. ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.  ఈ మూవీ పై త‌న‌కు లభించిన ప్రశంసల్ని గుర్తు చేసుకున్నారు. అఖిల్ చాలా హార్డ్ వర్క్ చేశారని ఈ సినిమాతో అతని రేంజ్ 10 నుంచి 100 శాతం పెరుగుతుందని తెలిపారు.

Also Read : ఏజెంట్ టీజర్ పై మ‌హేష్ ఏమ‌న్నారో తెలుసా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్