Sunday, January 19, 2025
Homeసినిమా#NBK109: బాలయ్య మూవీ వేరే లెవల్ లో ఉంటుందా..?

#NBK109: బాలయ్య మూవీ వేరే లెవల్ లో ఉంటుందా..?

నందమూరి బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ సినిమా చేశారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా దసరాకి అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య.. బాబీ డైరెక్షన్ లో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఇటీవల ఈ సినిమాను ప్రకటించడం.. పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం కూడా జరిగింది. ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి ఉండాలి కానీ.. ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉంది.

ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే… ఇందులో బాలయ్యకు జంటగా మీనాక్షి చౌదరి నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీనాక్షి చౌదరి.. ఊహించని విధంగా భారీ ఆఫర్స్ అందుకుంటుంది. మహేష్‌ బాబుతో గుంటూరు కారంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఆతర్వాత నుంచి ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగింది. విజయ్ సరసన కూడా నటించే ఛాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు బాలయ్యకు జంటగా నటించనుందని తెలిసింది.

అయితే.. ఈ సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని.. సెకండాఫ్ లో ఓ ఇరవై నిమిషాలు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని నిర్మాత నాగవంశీ ఇటీవల ఇచ్చిన ఇంటర్ వ్యూలో తెలియచేశారు. దీంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి రానుంది అంటే.. డిసెంబర్ నుంచి అని తెలిసింది. బాలయ్య పొలిటికల్ గా బిజీ అయ్యారు కాబట్టి ఆలస్యం అయ్యింది కానీ.. లేకపోతే ఈపాటికే ఈ సినిమా సెట్స్ పై ఉండేది. ఇందులో బాలయ్య రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారని ఈ రెండు పాత్రలు ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేస్తాయని టాక్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్