Sunday, January 19, 2025
HomeTrending Newsచావు కోరల్లో ప్రొఫెసర్ సాయిబాబా - POW సంధ్య ఆందోళన

చావు కోరల్లో ప్రొఫెసర్ సాయిబాబా – POW సంధ్య ఆందోళన

మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టు అయిన ప్రొఫెసర్ డాక్టర్ జిఎన్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని ప్రగతి శీల మహిళా సంఘం, జాతీయ కార్యదర్శి సంధ్య ఆందోళన వ్యక్తం చేశారు.  క్రూరమైన బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వ విధానాల వల్ల అక్రమ నిర్బంధంలో ఉన్న ఆయన ఆరోగ్య స్థితి రోజు రోజుకీ దిగజారుతున్నదన్నారు. అయినా వైద్యం చేయించడానికి నిరాకరిస్తున్న దుస్థితి దాపురించింది ఈ దేశపు అప్రజాస్వామిక పాలనలో అని మండిపడ్డారు.
ప్రొఫెసర్ సాయిబాబా ఆయన  భార్య వసంతకి నవంబర్ 2న లేఖ రాశారని సంధ్య తెలిపారు.
ఉత్తరం ద్వారా తెలిపిన విషయం ఏంటంటే…
“నాగ్‌పూర్‌లో ఇప్పటికే చలికాలం మొదలైంది. నా కాళ్లు, చేతులు, కడుపు ఇంకా ఛాతీలోని కండరాలు తీవ్రమైన నొప్పులు వస్తున్నాయి. COVID-19 రెండుసార్లు దాడులు, దానికి తోడు స్వైన్ ఫ్లూ ద్వారా నేను చాలా బలహీనంగా మారినందున నేను ఈ నొప్పులను భరించలేకపోతున్నాను. నా మూత్రపిండాలలో సమస్య, మెదడులోని నరాల బాధ, రుమాటిక్ నొప్పులకు అత్యవసర వైద్య చికిత్సను చేయంచడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. GMCHలోని వైద్యులు వీటికి, ఇతర ప్రాణాంతక వ్యాధులకు తక్షణం చికిత్స చేయాలని రాశారని సంధ్య తెలిపారు.


సాయిబాబా ఆరోగ్యం క్షీణించి ప్రాణం మీదకు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, బిజెపి ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని సంధ్య ఆరోపించారు. సాయిబాబా ఆరోగ్యం బాగుపడే వరకు కుటుంబ సభ్యుల వద్ద ఉండేలా… మెరుగైన వైద్య చికిత్స అందేలా కేంద్ర హోం శాఖ చర్యలు తీసుకోవాలని సంధ్య డిమాండ్ చేశారు.

Also Read : బాంబే హైకోర్టు కీలక తీర్పు… ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్