Saturday, January 18, 2025
HomeTrending Newsకందులు, ఆయిల్ పామ్, పత్తి సాగుతో లాభాల పంట

కందులు, ఆయిల్ పామ్, పత్తి సాగుతో లాభాల పంట

మన దేశం నుంచి గోధుమల ఎగుమతిని ప్రధాని మోడీ నిలిపివేశారని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. చిన్న, చిన్న దేశాలు ఇతర దేశాలకు  వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు చేస్తుంటే .. దాదాపు 40 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్న మన దేశం ఎగుమతులను నిషేధించడం శోచనీయమన్నారు. వరంగల్లో ఈ రోజు నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల వానాకాలం పంటల అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పరిస్థితిని రైతులకు తెలియజెప్పి చైతన్యం చేయాలని పిలుపు ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపాన్ని సంపూర్ణంగా మారిస్తే .. తెలంగాణ నుండి వస్తున్న వరి ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం ప్రకటించడం రైతులు గమనించాలన్నారు. రైతు వేదికలలో నిరంతరం రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని,  ఆధునిక వ్యవసాయం, ఎరువులు, పురుగుమందుల యాజమాన్య పద్దతులు వంటి వాటిపై చైతన్యం చేయాలని అధికారులను మంత్రి కోరారు. తెలంగాణ భూములలో భాస్వరం స్థాయి అవసరానికి మించి ఉన్నది .. దానిని సరిచేసేందుకు పాస్ఫేట్ వినియోగించడం జరుగుతున్నదని, పంటల ఉత్పాదకతను పెంచలేక అంతర్జాతీయ మార్కెట్ లో మన వ్యవసాయ ఉత్పత్తులు అమ్మే పరిస్థితి లేక కేంద్రం ఎగుమతులపై చేతులు ఎత్తేసిందని విమర్శించారు.

పంటల ఉత్పత్తులు పెంచే వంగడాలను సృష్టించలేని కేంద్రం దేశంలో పండిన పంటలను కూడా కొనకుండా చేస్తోందని మండిపడ్డారు. జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ నేపథ్యంలో కందులు, ఆయిల్ పామ్, పత్తి సాగు పెంచాలని తెలంగాణ రైతాంగాన్ని మంత్రి కోరారు. ఆయిల్ పామ్ సాగు విషయంలో రైతులను చైతన్యం చేయడంలో విజయవంతమయ్యామని, ఉద్యాన, కాయగూరల్లో విభిన్న పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలన్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న తోతాపురి మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, అరటి సాగు వైపు ఉద్యానశాఖ రైతులను ప్రోత్సహించాలని, భూమిని ఖాళీగా పెట్టడం లేదా అధిక ఎరువులు, రసాయనాలు వాడడం ద్వారా భూమి నిస్సారమవుతుంది .. భూమిని నిరంతరం సాగులో ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు. జులై 15 తర్వాత పత్తి సాగు చేయవద్దని, తెలంగాణలోని ప్రతి రైతు శాస్త్రవేత్తను మించిన అనుభవం సాధించాలని.. ప్రతి రైతు చదువుకోని శాస్త్రవేత్తని మంత్రిఅన్నారు.

మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 2014 బీజేపీ మేనిఫెస్టోలో పెట్టి మాటతప్పారు. ఏదైనా రాష్ట్రంలో అన్ని బాగుంటే అది తమవల్లనే అనే రకం బీజేపీ నేతలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేయ చేతగాని కాంగ్రెస్ తెలంగాణలో డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రైతులు అమాయకులని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భావిస్తున్నాయని, చాంధసవాద దేశాలు అనుకున్న ప్రాంతాలు మహిళల భాగస్వామ్యంతో పురోగమిస్తున్నాయని, మన దేశాన్ని మాత్రం తిరోగమనం వైపు నడిపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎంపీలు మాలోతు కవిత, దయాకర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, గండ్ర వెంకటరమణ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ ముదిరాజ్, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు గోపి, శశాంక్, భవేష్ మిశ్రా, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్