Monday, June 17, 2024
HomeసినిమాProject K: 'ప్రాజెక్ట్ కే' కథ ఇదేనా..?

Project K: ‘ప్రాజెక్ట్ కే’ కథ ఇదేనా..?

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే‘. ఈ చిత్రంలో ప్రభాస్ కు జంటగా దీపికా పడుకునే నటిస్తుంటే… కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి స్క్రిప్ట్ పర్యవేక్షకుడిగా, ఒక గైడ్ లా వర్క్ చేస్తుండడం విశేషం. అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే… ప్రాజెక్ట్ కే అనగానే.. కే అంటే కర్ణ అని.. లేదు కే అంటే కల్కి అని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఇది భారతం ఆధారంగా ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు రూపొందిస్తున్న సినిమాని ప్రచారం జరిగింది. మరో వార్త ఏంటంటే.. ఇది టైమ్ మిషన్ నేపధ్యంలో సాగే కథ అని.. అందుకనే సింగీతం శ్రీనివాసరావు హెల్ప్ తీసుకుంటున్నారని కూడా టాక్ వినిపించింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఇందులో సైన్స్ ఫిక్ష‌న్ జోన‌ర్‌లో చాలా స‌న్నివేశాలు ఉంటాయట. భూమిని పోలిన మ‌రో గ్ర‌హంఉందా.? మాన‌వాళి… అక్క‌డ నివ‌సించ‌గ‌ల‌దా? అనే విష‌య‌మై చాలా కాలంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.

ఒక‌వేళ భూమి అంత‌రించిపోతే, మ‌రో గ్ర‌హంలో జీవినం సాగించ‌గ‌ల‌మా? అనే చ‌ర్చ ఎప్ప‌టి నుంచో జ‌రుగుతోంది. ఈ సినిమా కథాంశం ఇదే అని.. భూమిని పోలిన మరో గ్రహం చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంగ్లీషు వెర్షెన్ కూడా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మొత్తానికి ప్రాజెక్ట్ కే సినిమాతో చరిత్ర సృష్టించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మరి..  అంచనాలను ఎంత వరకు అందుకుంటారో చూడాలి.

Also Read: టెన్షన్ లో ప్రాజెక్ట్ కే మేకర్స్..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్