బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన రెండు సినిమాలు…సాహో, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీనితో తర్వాtతి సినిమాపై అతడి అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకొని గ్రాఫిక్స్ పనిలో ఉండగా మరో మూడు సినిమాలు…. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’… నాగ అశ్విన్ రూపొందిస్తోన్న ‘ప్రాజెక్ట్ కే’… మారుతి దర్శకత్వంలో ‘రాజ డీలక్స్’ అనే వినోదాత్మక సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి.
‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తయినా రిలీజ్ ఎప్ప్పుడో చెప్పలేని పరిస్థితి. ట్రైలర్ పై అభిమానులు తీవ్రంగా నిరుత్సాహం చెందడంతో మళ్ళీ గ్రాఫిక్స్ పని మొదలు పెట్టారు. అది ఓ దశకు వచ్చిన తరువాతే విడుదలకు ముహూర్తం ఫిక్స్ అవుతుంది. ‘సాలార్’ ను సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు ప్రశాంత్ నీల్ ప్రకటించగా, తాజాగా నాగ అశ్విన్ కూడా తమ ‘ప్రాజెక్ట్ కే’ ను సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న విడుదల చేస్తున్నట్లు వెల్లడించాడు. దీనికి సంబంధించి ఓ ఫోటోను కూడా విడుదల చేశారు. యుద్ద సన్నివేశంలో ఓ భారీ చేయి కూలిపోయి ఉండడం, దానికి గురి పెడుతూ ముగ్గురు గన్స్ పట్టుకొని వెళుతుండే సీన్ ను చూపించారు. విడుదల తేదీని కూడా కళాత్మకంగా రూపొందించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ప్రాజెక్ట్ కేను నిర్మిస్తుండగా ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే, కీలక పాత్రలో అమితాబ్ నటిస్తుండడం విశేషం. ఈ మూవీకి సంబంధించి సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు నాగ్ అశ్విన్ కు కీలక సూచనలు ఇస్తున్నారు.
మరోవైపు, ఆది పురుష్ ను కూడా త్వరగా విడుదల చేయాలని ప్రభాస్ అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. గ్రాఫిక్స్ పూర్తి చేసుకొని సమ్మర్ కు ఈ సినిమా వస్తుందో లేదో చూడాలి.
Also Read : స్పీడో మీటర్ కు -‘ప్రాజెక్ట్ కే’ కు లింకేంటి?