First Single Promo: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు సరసన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ భారీ, క్రేజీ మూవీని మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈరోజు సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ‘వందో .. ఒక వెయ్యో .. ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా .. ఏందే ఈ మాయ..’ అంటూ ఈ పాట మొదలవుతోంది. కథానాయిక కీర్తి సురేష్ ను ఫాలో అవుతూ మహేష్ బాబు పాడే పాట ఇది. ఫారిన్లో చిత్రీకరించారు. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీత అందించారు. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ఇక పూర్తి పాటను ఈ నెల 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. ఇలా వరుసగా విజయాలు సాధించిన మహేష్ ‘సర్కారు వారి పాట’తో కూడా మరో బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.