Protest Against Lockdown :
యూరోపియన్దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. కేసులు వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు లాక్డౌన్ విధించడంతోపాటు కఠిన ఆంక్షలు పెడుతుండగా.. పౌరులు వాటిని ఒప్పుకోవడంలేదు. లాక్డౌన్ రూల్స్, కరోనా ఆంక్షలను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నెదర్లాండ్స్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ దేశ ప్రభుత్వం డిసెంబర్ 19 నుంచి లాక్డౌన్ విధిస్తూ ఆంక్షలు పెట్టింది. లాక్డౌన్ రూల్స్‌ను వ్యతిరేకిస్తూ జనం పెద్ద సంఖ్యలో ఆందోళనలు చేస్తున్నారు. నెదర్లాండ్స్‌లోని అనేక పట్టణాలు, నగరాల్లో శనివారం నుంచి వరుసగా రెండో రోజు అల్లర్లు చెలరేగాయి. రాజధాని ఆమ్స్టర్డామ్ లో వేలమంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రదర్శనకారుల్ని కట్టడి చేసే క్రమంలో పదిమంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
రోటర్‌డామ్ సిటీలో నిరసనలు హింసాత్మకంగా మారాయి.పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. హేగ్‌లో ప్రజలు పోలీసులపై టపాసులు పేల్చి, వాహనాలకు నిప్పంటించారు. నిరసనకారులు విసిరిన రాయి పేషెంట్‌ను తీసుకెళ్తున్న అంబులెన్స్ కిటికీకి తాకింది. అయిదుగురు పోలీసులు గాయపడ్డారు. అధికారులు నగరంలో కర్ఫ్యూ విధించారు. హింసకు పాల్పడిన 30 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. సెంట్రల్ ‘బైబిల్ బెల్ట్’ పట్టణం ఉర్క్, దక్షిణ లిమ్‌బర్గ్ ప్రావిన్స్‌లోని నగరాల్లో కూడా అల్లర్లు చెలరేగాయి.
అత్యవసర సేవలు మినహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. హోటల్స్, సినిమా థియేటర్లు, క్లబ్ లు అన్ని మూసివేయటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : మహారాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా