Sunday, November 24, 2024
HomeTrending Newsనింగిలోకి దూసుకెళ్ళిన పీఎస్‌ఎల్‌వీ సీ54

నింగిలోకి దూసుకెళ్ళిన పీఎస్‌ఎల్‌వీ సీ54

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమయింది. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ54 ఉపగ్రహ వాహక నౌక ఓషన్ శాట్3ను శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఓషన్ శాట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా రాకెట్ ప్రవేశ పెట్టిందని ఇస్రో చైర్మన్ డా.సోమ్ నాథ్ వెల్లడించారు. సోలార్ ప్యానెల్స్ ఓపెన్ అయ్యాయని, నిర్దేశిత కక్ష్య లోకి ఉపగ్రహం చేరిందన్నారు. ఇంకా 8 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టాలని, వేగాన్ని తగ్గించి ఆర్బిట్ లోకి ప్రవేశపెడతామని పేర్కొన్నారు. దీనికి 2 గంటలు సమయం పడుతుందని స్పష్టం చేశారు.

రాకెట్  ప్రయోగానికి  కౌంట్‌డౌన్‌  ఈ ఉదయం 11.56 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ను ప్రయోగిం చారు. ప్రయోగానికి సంబంధించి షార్‌లోఎంఆర్‌ఆర్‌ కమిటీ చైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ ఆధ్వర్యంలో మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ జరిగింది. కాగా ఈ ప్రయోగం ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. ఇందులో 960 కేజీల ఓషన్‌శాట్-3తో పాటు మరో ఎనిమిది నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇస్రోకు చెందిన ఈఓఎస్‌–06 ఉపగ్రహంతో పాటు 8 ఉప గ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తోంది. షార్‌ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సిరీస్‌లో 56వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ల్‌ వెర్షన్‌లో 24వది కావడం విశేషం. ఇక్కడికి వచ్చిన ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌.. పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ను మరోమారు తనిఖీలు నిర్వహించారు. కాగా ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ శుక్రవారం షార్‌ సమీపంలో చెంగాళమ్మ ఆలయంతోపాటు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేశారు. భూటాన్ 2019లో తన మొదటి ఉపగ్రహం భూటాన్-1ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇది విద్య ఆధారిత క్యూబ్‌శాట్. ఓషన్‌శాట్ శ్రేణి ఉపగ్రహాలు భూమి పరిశీలన, నీటి వనరుల పర్యవేక్షణ, తుఫానుల అంచనా కోసం వినియోగిస్తున్నారు. మొదటి Oceansat 1999లో భూమి పైన దాదాపు 720 కి.మీ. దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో ప్రయోగించారు.

Also Read : 36 ఉపగ్రహాలను కక్షలోకి చేర్చిన మార్క్ -3 

RELATED ARTICLES

Most Popular

న్యూస్