Friday, November 22, 2024
Homeసినిమాపేదోడి కోపం పెద్దోళ్లకీ చేటని చెప్పే 'పీటీ సర్'

పేదోడి కోపం పెద్దోళ్లకీ చేటని చెప్పే ‘పీటీ సర్’

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోలుగా మారుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. సంగీత దర్శకుడిగా ఉన్న విజయ్ ఆంటోని .. జీవీ ప్రకాశ్ కుమార్ హీరోలుగాను వరుస సినిమాలు చేస్తూ, తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హిప్ హాప్ తమిళన్ కూడా అదే బాటలో ముందుకు వెళుతున్నాడు. ఇప్పటికే ఆయన తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన నుంచి క్రితం నెలలో ‘పీటీ సర్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

కార్తీక్ వేణుగోపాలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కశ్మీర పరదేశి – అనిఖ సురేంద్రన్ – త్యాగరాజన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఒక ‘పీటీ సర్’ తాను పనిచేస్తున్న విద్యా సంస్థల చైర్మన్ తో తలపడటమే ఈ సినిమా కథ. నిజానికి ఇది చాలా డిఫరెంట్ కంటెంట్. సాధారణంగా ‘పేదవాడి కోపం పెదవికి చేటు’ అనే ఒక సామెత మనకి వినిపిస్తూ ఉంటుంది. పేదవాడి కోపం పెద్దోళ్లకీ చేటే’ అని నిరూపించే కథ ఇది.

సాధారణంగా డబ్బున్నవారికే అవినీతి అధికారుల అండదండలు ఉంటాయి. ఆ అధికారులు కేసును తప్పుదోవ పట్టించడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అలా కాకుండా కాస్త తెలివిగా ప్లాన్ చేస్తే,ఎంతటివారినైనా కోర్టు బోనులో నిలబెట్టవచ్చు అని చెప్పే కంటెంట్ ఇది. దర్శకుడు ప్రధానమైన కథాంశాన్ని పెర్ఫెక్ట్ గా చెప్పడంపైనే దృష్టి పెట్టాడు. అందువలన ఇతర ట్రాకులు పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. మొదటి నుంచి చివరివరకూ పట్టుగా సాగే ఈ కథ, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్