Sunday, January 19, 2025
HomeసినిమాPooja Hegde: టెన్షన్ లో పూజ హెగ్డే!

Pooja Hegde: టెన్షన్ లో పూజ హెగ్డే!

పూజ హెగ్డే .. వెండితెరకి పరిచయమైన నాజూకు సౌందర్యం. వెండితెరపై వ్రేలాడదీసిన మల్లెతీగలా ఆమె కనిపిస్తుంది. అందం .. అందుకు తగిన అభినయం ఆమె సొంతం. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ప్లేస్ లో ఆమెనే ఉంది. అలాంటి పూజ హెగ్డేకి కొంతకాలంగా భారీ హిట్ పడలేదు. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ తో ఆమె చేసిన ‘రాధే శ్యామ్’ ప్రేక్షకులను నిరాశ పరిచింది. అంతేకాదు ఆ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.

ఆ తరువాత తమిళంలో విజయ్ జోడీగా ఆమె ‘బీస్ట్’ సినిమా చేసింది. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. అప్పటివరకూ వరుస హిట్లతో ఉన్న విజయ్ కి కూడా అసంతృప్తిని మిగిల్చిన సినిమా ఇది. ఇలా రెండు పాన్ ఇండియా సినిమాలు భారీ స్థాయిలో ఆమె అభిమానులను నిరాశపరిచాయి. ఈ సమయంలోనే భారీ బడ్జెట్ తో నిర్మితమైన ‘ఆచార్య’ కూడా ఆమెను డీలాపడేలా చేసింది. నిజానికి ఏ హీరోయిన్ అయినా డిప్రెషన్ లోకి వెళ్లిపోయే పరిస్థితి ఇది.

పాన్ ఇండియా స్థాయి సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడం వలన, మళ్లీ పాన్ ఇండియా స్థాయి సినిమాలతోనే ఆమె సమాధానం చెప్పవలసి ఉంటుంది. అలాంటి అవకాశమే ఆమెకి ‘కిసీ కా భాయ్  .. కిసీ కీ జాన్’ తో వచ్చింది. ఇది సల్మాన్ సొంత సినిమా .. పైగా వెంకటేశ్ .. జగపతిబాబు వంటి స్టార్స్ ఉన్న సినిమా కావడం విశేషం. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఆశతో పూజ హెగ్డే ఎదురుచూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే ఆమె టెన్షన్ పడటం సహజమే కదా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్