Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: పూణే; యూపీ విజయం

ప్రొ కబడ్డీ: పూణే; యూపీ విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో హర్యానాపై పూణే, జైపూర్ పై యూపీ విజయం సాధించాయి.

పునేరి పల్టాన్ హర్యానా స్టీలర్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ 45-27తో పూణే ఘన విజయం సాధించింది. ఆట మొదటి నుంచీ పూణే సత్తా చాటి ప్రథమార్ధం ముగిసేనాటికి 26-7తో భారీ ఆధిక్యం ప్రదర్శించింది. రెండో భాగంలో హర్యానా తేరుకొని గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 20­-19తో కేవలం ఒక్క పాయింట్ మాత్రమే ఎక్కువ సంపాదించగలిగింది. దీనితో మొదటి భాగంలోని ఆధిక్యంతో 18 పాయింట్ల తేడాతో తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. పూణే ఆటగాళ్ళు మొహిత్ గాయట్- 12; అస్లాం ఇమాందార్ -8; పాయింట్లతో రాణించారు.

యూపీ యోధ – జైపూర్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 41-34తో  యూపీ గెలుపొందింది. ఆట తొలి భాగంలో 19-18 తో జైపూర్ స్వల్ప ఆధిక్యం సంపాదించింది. ద్వితీయార్ధంలో యూపీ సత్తా చాటి 23-15తో ముందంజలో నిలిచింది. దీనితో మ్యాచ్ ముగిసే నాటికి 7 పాయింట్ల తేడాతో యూపీ గట్టెక్కింది. జైపూర్ ఆటగాడు అర్జున్ దేశ్వాల్, యూపీ రైడర్ ప్రదీప్ నర్వాల్ చెరో 14  పాయింట్లు సంపాదించి సత్తా చాటారు.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… పాట్నా పైరేట్స్ (70 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (60); హర్యానా స్టీలర్స్(58); యూపీ యోధ (57); బెంగుళూరు బుల్స్ (55); జైపూర్ పింక్ పాంథర్స్ (52) టాప్ సిక్స్ లో ఉన్నాయి. పాట్నా తర్వాతి రౌండ్ కు క్వాలిఫై అయ్యింది.

Also Read : ప్రొ కబడ్డీ: పాట్నా విజయం; బెంగాల్-ఢిల్లీ మ్యాచ్ టై  

RELATED ARTICLES

Most Popular

న్యూస్