సేర్బియాలోని బెల్ గ్రేడ్ లో జరుగుతోన్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో ఇండియా రెండో పతకం గెల్చుకుంది. నేడు జరిగిన పురుషుల పురుషుల 65 కిలోల కేటగిరీలో మన దేశానికి చెందిన భజరంగ్ పునియా కాంస్య పతకం గెల్చుకున్నాడు. ప్యూర్టో రికో దేశానికి చెందిన సెబాస్టియన్ రివేరా పై 11-9 పాయింట్లతో విజయం సాధించాడు.
కాంస్య పతక పోరులో తొలుత 0-6 తో వెనుకబడిన పునియా ఆ తర్వాత తేరుకొని ప్రత్యర్థిని మట్టికరిపించాడు. టోక్యో ఒలింపిక్స్ లో 65 కిలోల విభాగంలో కాంస్యం గెల్చుకున్న పునియా ఇటీవలి కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకం గెల్చుకున్నాడు.
రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో ఇండియాకు ఇది రెండో పతకం. మహిళల 53 కిలోల కేటగిరీలో వినేష్ ఫోగట్ కాంస్య పతకం గెల్చుకుంది. స్వీడన్ క్రీడాకారిణిపై 8-0తో విజయం సాధించింది. ఫోగట్ కూడా బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకం గెల్చుకుంది.
పునియా, ఫోగట్ లను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.
Also Read: ట్రోఫీలు వాటి వెనకున్న చరిత్ర