Tuesday, April 8, 2025
HomeTrending Newsఅగ్నిపధ్ వద్దు... పంజాబ్ అసెంబ్లీ తీర్మానం

అగ్నిపధ్ వద్దు… పంజాబ్ అసెంబ్లీ తీర్మానం

త్రివిధ దళాల్లో రిక్రూట్ మెంట్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిప‌థ్ స్కీమ్ ను వ్య‌తిరేకిస్తూ పంజాబ్ శాసనసభ ఈ రోజు తీర్మానం చేసింది. ప్ర‌తిప‌క్షాలు రాష్ట్ర ప్ర‌భుత్వానికి మద్దతు ఇచ్చాయి. ఈ పథకం పంజాబ్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపధ్ పతాకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిఎం మాన్ డిమాండ్ చేశారు.

ప్రస్తుతం సైన్యంలో పంజాబ్ నుంచి 7.8 శాతం యువత ప్రాతినిధ్యం వహిస్తోందని అయితే ఈ పథకం వల్ల భవిషత్తులో అది 2.3 శాతానికి పడిపోతుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ పథకం పంజాబ్ ప్రయోజనాలకు విరుద్ధం అని మిస్టర్ బజ్వా వాదించారు. ‘‘ ఒక 17 ఏళ్ల యువకులు రక్షణ దళాలలో చేరితారు. అందులో ఎక్కువ మంది యువ‌కులు నాలుగేళ్ల స‌ర్వీస్ త‌రువాత ఇంటికి తిరిగి వ‌స్తారు. అప్పుడు వారు మాజీ అవుతారు. అయితే అలా మాజీ అయిన వారికి త‌రువాత ఎలాంటి ప్ర‌యోజ‌నాలు కూడా ఉండ‌వు ’’ అని భగవంత్ మాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వనీ శర్మ అగ్నిపథ్ పథకాన్ని సమర్థించారు. ఈ అంశంపై సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ పథకం అమలైతే 2029లో కూడా తాము అధికారంలోకి రాలేమని వారికి తెలుసు అని కాంగ్రెస్ ను విమ‌ర్శించారు.

Also Read : అగ్నిప‌థ్ లో 45వేల మందికి అవకాశం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్