Saturday, January 18, 2025
HomeTrending Newsపంజాబ్ మంత్రివర్గ విస్తరణ

పంజాబ్ మంత్రివర్గ విస్తరణ

పంజాబ్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం  సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ భన్వరిలాల్  పురోహిత్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత సీఎం తన కేబినెట్ ను విస్తరించారు. ఐదుగురు మంత్రుల చేరికతో పంజాబ్ కేబినెట్ సంఖ్య సీఎంతో కలిపి 15కి చేరుకుంది.

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన మంత్రివర్గంలోకి కొత్తగా సునం ఎమ్మెల్యే అమన్ అరోరా,  అమృతసర్ దక్షిణ ఎమ్మెల్యే సింగ్ నిజ్జర్,  ఖరార్ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ , గుర్ హర సాహి శానసభ్యుడు ఫౌజా సింగ్ సరారి, సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరమజ్ర లను తీసుకున్నారు.

Also Read :  అగ్నిపధ్ వద్దు… పంజాబ్ అసెంబ్లీ తీర్మానం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్