Sunday, February 23, 2025
HomeTrending Newsపదిమందితో భగవంత్ మాన్ మంత్రివర్గం

పదిమందితో భగవంత్ మాన్ మంత్రివర్గం

Punjab Cabinet Ministers : పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంలో ఈ రోజు(శనివారం) పది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. చండీగడ్ రాజ్ భవన్ లో  నిరాడంబరంగా జరిగిన వేడుకల్లో గవర్నర్ భన్వర్  లాల్ పురోహిత్ కొత్త మంత్రులతో ప్రామాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా హాజరయ్యారు.  అనంతరం పంజాబ్ సచివాలయంలో మంత్రులు బాధ్యతలు చేపట్టారు. రెండుసార్లు దీర్బా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన హర్పాల్ సింగ్ చీమా, మాలౌత్ నుంచి గెలుపొందిన బల్జీత్ కౌర్, జాందియాల ఎమ్మెల్యే హర్భజన్ సింగ్ ఈతో, మాన్సా ఎమ్మెల్యే విజయ్ సింగ్లా, భోవా ఎమ్మెల్యే లాల్ చంద్ కటారుచక్, బార్నాలా ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ మీత్ హాయర్, అజ్నాలా ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ధలివాల్, పాటి ఎమ్మెల్యే లాల్ జిత్ సింగ్ భుల్లార్, హోషియార్ పూర్ ఎమ్మెల్యే బ్రహ్మ శంకర్ జింపా, ఆనంద్ పూర్ సాహిబ్ ఎమ్మెల్యే హర్జోత్ సింగ్ బెయిన్స్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు.

కొత్త కేబినెట్ లో హర్జోత్ సింగ్ బెయిన్స్ అత్యంత యువ మంత్రి కావడం విశేషం. ఒకే ఒక్క మహిళ బల్జీత్ కౌర్ కు ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు స్థానం దక్కింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా కేబినెట్ లో 18 శాఖలున్నాయి. మూడు రోజుల క్రితం విప్లవవీరుడు భగత్ సింగ్ స్వగ్రామమైన ఖాట్కర్ కలాన్ లో సీఎంగా మాన్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఇప్పటివరకు 11 మంది కేబినెట్ లో కొలువుదీరినట్టయింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్