Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్: బెంగుళూరుపై పంజాబ్ పంజా

ఐపీఎల్: బెంగుళూరుపై పంజాబ్ పంజా

IPL-2022: ఐపీఎల్ లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఘనవిజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే పంజాబ్ ఛేదించింది. ఓడియన్ స్మిత్ కేవలం 8 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, ఒక ఫోర్ తో 25; షారుఖ్ ఖాన్ 20 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ తో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు భానుక రాజపక్ష 22 బంతుల్లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో 43; శిఖర్ ధావన్-43(29 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్) పరుగులతో లక్ష్యసాధనలో తమ వంతు కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 32 పరుగులు చేశారు. లివింగ్ స్టోన్ కూడా 10 బంతులలో రెండు సిక్సర్లతో 19 పరుగులు చేసి ఔటయ్యాడు.  బెంగుళూరు బౌలర్లలో సిరాజ్ రెండు; ఆకాష్ దీప్, హసరంగ, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు.

ఈ మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురిసింది. రెండు జట్లలో ఆటగాళ్ళు మొత్తం 27 సిక్సర్లు బాదారు.

ముంబై లోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగుళూరు మొదటి వికెట్ కు 50  పరుగులు జోడించింది. అర్జున్ రావత్ 21 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో వికెట్ కు కెప్టెన్ డూప్లెసిస్- విరాట్ కోహ్లీ కలిసి 118 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. డూప్లెసిస్ 57 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. కోహ్లీ 41 పరుగులు చేయగా, దినేష్ కార్తీక్ కేవలం 14 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 32 పరుగులు చేసి సత్తా చూపాడు. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో ఆర్ష దీప్ సింగ్, రాహూల్ చాహర్ చెరో వికెట్ పడగొట్టారు.

ఓడియన్ స్మిత్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్