Sunday, January 19, 2025
HomeసినిమాPuri Jagannadh: పూరి నెక్ట్స్ మూవీ యువ హీరోతో..?

Puri Jagannadh: పూరి నెక్ట్స్ మూవీ యువ హీరోతో..?

పూరి జగన్నాథ్ ‘లైగర్’ మూవీ డిజాస్టర్ అవ్వడంతో ‘జనగణమన’ ఆగిపోయింది. నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఇప్పటి వరకు సెట్ కాలేదు. చిరంజీవితో పూరి సినిమా అంటూ ప్రచారం జరిగింది కానీ.. ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ కాలేదు. ఆటోజానీ ఆగిపోయినట్టే… ఇటీవల చెప్పిన స్టోరీ కూడా నచ్చకపోవడంతో చిరుతో అనుకున్న మూవీ ఆగిపోయింది. దీంతో పూరి వేరే హీరోలతో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నారని తెలిసింది. నట సింహం నందమూరి బాలకృష్ణతో పూరి జగన్నాథ్ పైసా వసూల్ అనే సినిమా చేశారు. ఆ సినిమాలో బాలయ్యను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటారో అలా చూపించారు.

అందుకనే ఆ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా.. అభిమానులకు మాత్రం బాగా నచ్చింది. అలాగే బాలయ్య, పూరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. ఇప్పుడు బాలయ్య కోసం కూడా స్టోరీ రెడీ చేస్తున్నారని టాక్ వినిపించింది. అయితే.. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలి అనుకుంటున్నారు. ఈ మూవీ తర్వాత ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో బాలయ్య భారీ చిత్రం చేయనున్నారు.

ఈ రెండు సినిమాలు పూర్తవ్వడానికి టైమ్ పడుతుంది. అందుచేత పూరికి అర్జెంటుగా డేట్స్ ఇచ్చే హీరో ఎవరున్నారంటే.. ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ గుర్తొచ్చాడు అనుకుంటా. ఇటీవల రామ్ కి స్టోరీ చెప్పాడని తెలిసింది. మరి.. రామ్ ఏమన్నాడో తెలియదు కానీ.. ఇప్పుడు పూరి జగన్నాథ్.. విశ్వక్ సేన్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడట. ఇదో మాస్‌ కమర్షియల్‌ హంగులతో సాగే కథనీ, త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. పూరినే ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తారని టాక్‌ వినిపిస్తోంది.

Also Read : పూరి నెక్ట్స్ మూవీ బాలయ్యతోనా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్