Sunday, January 19, 2025
HomeసినిమాPuri Jagannadh: పూరి తదుపరి చిత్రం ఎవరితో..? ఎప్పుడు..?

Puri Jagannadh: పూరి తదుపరి చిత్రం ఎవరితో..? ఎప్పుడు..?

పూరి జగన్నాథ్.. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అందించాడు. అయితే.. ఒక్క లైగర్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో సెట్స్ పై ఉన్న జనగణమన చిత్రం కూడా ఆగిపోయింది. ఆతర్వాత పూరి.. చిరంజీవితో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. సెట్ కాలేదు. బాలకృష్ణతో మూవీ ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరిగింది కానీ.. కుదరలేదు. రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ప్లాన్ అంటూ టాక్ వినిపించింది కానీ.. అది కూడా ఓకే అవ్వలేదు. మరి.. ఎవరితో మూవీ సెట్ అయ్యిందంటే.. విశ్వక్ సేన్ అని సమాచారం.

విశ్వ‌క్ సేన్ బాడీ లాంగ్వేజ్‌కీ, పూరి జగన్నాథ్ స్టైల్‌కీ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే.. పూరి హీరోకి కావాల్సిన లక్షణాలు అన్నీ విశ్వక్ సేన్ లో పుష్కలంగా ఉన్నాయి. అందుచేత ఈ కాంబోకి క్రేజ్ వచ్చేసినట్టే. ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ మూవీని ఆగష్టు నుంచి సెట్స్ పైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మూడు నెలల టైమ్ ఉంది. ఈలోగా పూరి స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేస్తారు. విశ్వక్ తను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తాడు. ఆతర్వాత ఈ క్రేజీ కాంబోలో మూవీ సెట్స్ పైకి వస్తుంది.

ఇది ఇస్మార్ట్ శంకర్ లా కొత్త బ్యాక్ డ్రాప్ లో కొత్తగా ఉంటుందట. విశ్వక్ కి కరెక్ట్ గా సెట్ అవుతుందని టాక్. పూరి ఇప్పుడు కసి మీద ఉన్నాడు. లైఫ్ లో ఎంతో చూశాడు కానీ.. లైగర్ తర్వాత మాత్రం బాగా ఇబ్బంది పడ్డాడు. ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలనే పట్టుదలతో సినిమా చేయబోతున్నాడు. ముంబాయిలోనే ఉండి కథ పై కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాను పూరి, విశ్వక్ కలిసి నిర్మించనున్నారని సమాచారం. మరి.. ఈ సినిమాతో పూరి బ్లాక్ బస్టర్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్