Saturday, January 18, 2025
Homeసినిమాపూరి లైఫ్ లెటర్.. సోషల్ మీడియాలో వైరల్

పూరి లైఫ్ లెటర్.. సోషల్ మీడియాలో వైరల్

డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’.  విజయ్ దేవరకొండ, అనన్య పాండే కాంబినేషన్ లో రూపొందిన ‘లైగర్’ భారీ అంచనాలతో వచ్చింది. అయితే.. ఊహించిన విధంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. అయితే.. ప్లాప్ అయ్యిందని పూరి డీలాపడలేదు కానీ.. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు అమౌంట్ ఇస్తానని చెప్పినా వినకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టడం.. బెదిరించడం వివాదస్పదం అయ్యింది. ప్రస్తుతం నెక్ట్స్ చేయబోయే సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ లో ఉన్నారు.

అయితే… లైగర్ వివాదం గురించి స్పందించమని అడిగితే.. ఆయన తన మనసులో మాటలను ఓ లెటర్ రూపంలో రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది. జయాపజయాలు రెండు వేరే కాదు… అవి ఒకటే. లైఫ్ లో జరిగే ప్రతి దాన్ని ఓ సంఘటన తాలూకా ఎక్స్ పీరియన్స్ గా మాత్రమే చూడాలి తప్పా ఫెయిల్యూర్ సక్సెస్ గా చూడకూడదు అని తెలిపారు. అలాగే సక్సెస్ అయితే డబ్బు వస్తుంది. ఓటమి వస్తే జ్ఞానం వస్తుంది. సినిమాలో హీరోలకి జరిగినట్టే అందరికీ జరుగుతాయని అంతా పొగుడుతారు తిడతారు.

నిజాన్ని ఎవరూ కాపాడాల్సిన పని లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది అని.. తాను ఒక్క ఆడియెన్స్ ని తప్పా ఎవరినీ మోసం చెయ్యలేదు. వాళ్ళని మళ్ళీ మంచి సినిమా తీసి తప్పకుండా ఎంటర్టైన్ చేస్తానని చివరి మాటలుగా ఇందులో చెప్పారు. వీటితో పాటుగా ఇక డబ్బు అంటారా చచ్చాక ఇక్కడ నుంచి ఒక్క రూపాయి తీసుకెళ్లినవాడిని ఒక్కడిని చూపించండి. నేను కూడా దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేది అంతా డ్రామా  అంటూ పూరి ముగించారు. ఈ పూరి మార్క్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్