Sunday, January 19, 2025
Homeసినిమాపూరి నెక్ట్స్ మూవీ బాలయ్యతోనా..?

పూరి నెక్ట్స్ మూవీ బాలయ్యతోనా..?

పూరి జగన్నాథ్ ‘లైగర్’ మూవీతో అంచనాలను అందుకోలేకపోయారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఆతర్వాత విజయ్ తో చేయాలి అనుకున్న ‘జనగణమన’ చిత్రం క్యాన్సిల్ అయ్యింది. దీంతో పూరి నెక్ట్స్ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీలో పూరి జగన్నాథ్ ఓ ముఖ్యపాత్ర పోషించారు. ఆ సినిమా సక్సెస్ సాధించింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవని, పూరి జగన్నాథ్ ఇంటర్ వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్ వ్యూలో చిరంజీవి.. పూరిని మంచి కథ చెప్పు.. మనం సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చారు.

పూరి జగన్నాథ్ కూడా మీ కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాను అని.. త్వరలోనే కథ చెబుతానని చిరంజీవికి చెప్పడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అని ప్రచారం మొదలైంది. ‘భోళా శంకర్’ తర్వాత చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయకపోవడంతో పూరితో సినిమాని త్వరలో ప్రకటిస్తారని టాక్ గట్టిగా వినిపించింది. ఆతర్వాత పూరి నెక్ట్స్ మూవీ చిరంజీవితో కాదు.. తనయుడు ఆకాష్ తో చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఆకాష్ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అందుచేత ఇప్పుడు పూరి ఆకాష్ తో మూవీ చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపించింది.

ఇప్పుడు పూరి నెక్ట్స్ చిరంజీవితో కాదు.. ఆకాష్ తో కాదు.. బాలకృష్ణతో అంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది. బాలయ్య కోసం పూరి జగన్నాధ్ మంచి ఎంటర్ టైన్మెంట్ ఉన్న కథను రాశారట. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక ఎమోషనల్ యాక్షన్ స్టోరీ అని తెలుస్తోంది. తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ కథ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. గతంలో వీరిద్దరూ కలిసి పైసా వసూల్ అనే సినిమా చేశారు. మరి.. పూరితో మూవీకి బాలయ్య ఓకే చెబుతారా.? ప్రచారంలో ఉన్నది నిజమేనా..? కాదా..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్