పూరి – రామ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సంచలన విజయాన్ని సాధించింది. మాస్ హీరోగా ఇమేజ్ కోరుకుంటున్న రామ్ కి ఈ సినిమా కావలసినంత మాస్ ఇమేజ్ ను కట్టబెటింది. ఆ తరువాత పూరి – రామ్ ఎవరి దారిలో వారు సినిమాలు చేస్తూ వెళ్లినా, ఆ స్థాయి హిట్ మాత్రం దక్కలేదు. దాంతో మళ్లీ ఇద్దరూ కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’ అంటూ ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.
పూరి – చార్మి కలిసి నిర్మించిన ఈ సినిమాలో రామ్ జోడీగా కావ్య థాపర్ సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘వరంగల్’లో జరిగింది. ఈ వేదికపై పూరి మాట్లాడుతూ .. రామ్ లో కసి ఉందనీ .. ఆ కసిని తాను గమనించడం వల్లనే ఆ స్థాయికి తగిన విధంగా ఆ పాత్రను డిజైన్ చేయగలిగానని అన్నారు. రామ్ లుక్, నడక, ఆయన స్టెప్పులు ఏది ప్రేక్షకులను అక్కట్టుకున్నా, అందుకు కారణం ఆయన ఎనర్జీ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రామ్ లేకపోతే ఈ సినిమానే లేదని స్పష్టం చేశారు.
హీరో రామ్ మాట్లాడుతూ . “నా సినిమాల నుంచి ఆడియన్స్ డాన్సులను ఎక్కువగా ఆశిస్తారు. ‘ఇస్మార్ట్ శంకర్’ పాటల కంటే కూడా ఈ సినిమాలోని పాటలు హుషారెత్తిస్తాయి. అందుకు కారణం మణిశర్మగారనే చెప్పాలి. ఆయన ఇచ్చిన ఆల్బమ్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ అవుతుంది. సంజయ్ దత్ గారివంటి గొప్ప నటుడితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఇక ఈ సినిమాలో నా ఎనర్జీకి కారణం పూరి గారే. పేల్చే గన్ బాగుంటే .. బుల్లెట్ ఎంత ఫోర్స్ గా నైనా వెళుతుందంటూ అభిమానులను హుషారెత్తించాడు.