Sunday, September 8, 2024
Homeసినిమామళ్లీ తెరపైకి చిరు, పూరి మూవీ?

మళ్లీ తెరపైకి చిరు, పూరి మూవీ?

మెగాస్టార్ చిరంజీవి, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  కాంబినేషన్లో మూవీ వస్తుందనే ప్రచారం కొంతకాలంగా వస్తోంది. ఇటీవల ‘గాడ్ ఫాదర్’ లో చిరుతో కలిసి పూరి నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్ వ్యూలో మంచి కథ చెప్పు సినిమా చేద్దామని పూరికి  చిరు ఆఫర్ కూడా ఇచ్చారు.

అప్పటి నుంచి ఈ క్రేజీ కాంబో మూవీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల చిరంజీవికి పూరి కథ చెప్పారని.. ఆ కథ నచ్చలేదని ప్రచారం జరిగింది. అంతే కాకుండా చిరుకు చెప్పిన కథ నచ్చకపోవడంతో ఇస్మార్ట్ హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మళ్లీ చిరు, పూరి ప్రాజెక్ట్ తెర పైకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కోసం పూరి జగన్నాధ్ మంచి ఎంటర్ టైన్మెంట్ ఉన్న స్టోరీ రెడీ చేస్తున్నారట. త్వరలోనే చిరంజీవికి పూరి కథ వినిపించబోతున్నాడు అని టాక్ వినిపిస్తోంది.

చిరంజీవి.. ప్రస్తుతం భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. ఆగష్టు 11న భోళా శంకర్ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ప్రకటించలేదు. పూరి కోసమే చిరు వెయిటింగ్ అని.. ఈసారి ఎలాగైనా సరే.. పూరి డైరెక్షన్ లో మాంచి మాస్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. తండ్రీకొడుకుల నేపధ్యంలో సాగే ఈ స్టోరీ ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కూడా ఉంటుందట. మెగా అభిమానులు కూడా ఈ క్రేజీ కాంబో కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి.. ఈసారైనా చిరు, పూరి కాంబినేషన్లో మూవీ సెట్ అవుతుందో లేదో చూడాలి.

Also Read : Chiranjeevi: బ్రహ్మానందంను ప్రత్యేకంగా సత్కరించిన చిరంజీవి

RELATED ARTICLES

Most Popular

న్యూస్