Sunday, January 19, 2025
Homeసినిమాపూరి అలా చేస్తాడని ఊహించలేదన్న వక్కంతం వంశీ!

పూరి అలా చేస్తాడని ఊహించలేదన్న వక్కంతం వంశీ!

హీరోగా తెరపై సందడి చేద్దమని ఇండస్ట్రీకి వచ్చిన వక్కంతం వంశీ, ఆ తరువాత సినీ రచయితగా మంచి పేరు తెచ్చుకుని, దర్శకుడిగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వచ్చిన ఆయన తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. “హీరోగా నేను చేసిన మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో ఆ తరువాత అవకాశాలు రాలేదు. మా ఫాదర్ మంచి రైటర్. అందువలన నా ఆలోచన కూడా అటువైపు వెళ్లింది. రైటర్ గా ప్రయత్నాలు మొదలెట్టాను.

“రచయితగా నన్ను దర్శకుడు సురేందర్ రెడ్డికి పరిచయం చేసింది ఎన్టీఆర్. అప్పటి నుంచి సురేందర్ రెడ్డితో నా అనుబంధం కొనసాగుతోంది. ఇక ‘టెంపర్’ సినిమాకిగాను పూరికి కథ వినిపించవలసి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దర్శకుడో అంతకు మించిన రైటర్. అయినా నా కథ నచ్చిందని చెప్పేసి ఆ సినిమా చేశారు. ఆ సినిమా క్లైమాక్స్ నేను అప్పటికప్పుడు అనుకుని చెప్పడం ఆయనకి బాగా నచ్చింది. ఆయన నన్ను అంతగా అభినందిస్తారని అనుకోలేదు”.

దర్శకుడిగా ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ ఆ కథ ఎటూ తేలకపోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఎన్టీఆర్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.  ‘రేసుగుర్రం’ సినిమా నుంచి బన్నీతో మంచి పరిచయం ఉంది. అందువలన ఆయనకి మరో కథ చెప్పి, ‘నా పేరు సూర్య’ చేశాను. ప్రస్తుతం నితిన్ తో ఒక సినిమా చేస్తున్నాను. ఆల్రెడీ షూటింగు మొదలైంది. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్