Sunday, January 19, 2025
Homeసినిమావిజయ్, పూరి జగన్నాథ్ 'జేజీఎం' షూటింగ్ ప్రారంభం

విజయ్, పూరి జగన్నాథ్ ‘జేజీఎం’ షూటింగ్ ప్రారంభం

Action Started: విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “‘జేజీఎం”. బిగ్గెస్ట్ యాక్షన్-డ్రామా పాన్ ఇండియా మూవీగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కాబోయే ఈ చిత్రం హై వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. దర్శకుడు పూరీ జగన్నాధ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఇది. పూరి కనెక్ట్స్, శ్రీకరా స్టూడియోస్ ప్రొడక్షన్‌లో చార్మి కౌర్, వంశీ పైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిగా చేరారు. విజయ్ దేవరకొండతో పూజాకి ఇది మొదటి చిత్రం.

పూజా హెగ్డే యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం మొదటి షూట్ షెడ్యూల్‌ ఈ రోజు ప్రారభించారు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూట్ షెడ్యూల్ ముంబైలో మొదలై పలు అంతర్జాతీయ ప్రదేశాలలో జరుగుతుంది. షూటింగ్ ప్రారంభం సందర్భంగా మేకర్స్ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. దర్శకుడు పూరి జగన్నాధ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించబోతున్నారు. అలాగే సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ లక్ష్యంగా ఈ సినిమా కోసం సిద్ధమయ్యారు. పూరి జగన్నాథ్ రచన దర్శకత్వం వహిస్తున్న ‘జేజీఎం’ 3 ఆగస్ట్ 2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్