Saturday, January 18, 2025
Homeసినిమాపుష్ప 2 లో కేథరిన్..?

పుష్ప 2 లో కేథరిన్..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘పుష్ప’. ఇందులో. రష్మిక నటించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంతో రూపొందిన ఈ సినిమా ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ పుష్ప.. పుష్పరాజ్ పాత్రలో అదిరిపోయే పెర్ ఫార్మెన్స్ ఇవ్వడంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. దీంతో ‘పుష్ప 2‘ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల పుష్ప 2 సెట్స్ పైకి వచ్చింది.

దీంతో అప్ డేట్స్ కోసం బన్నీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ప్రాజెక్టు కావడంతో, అందుకు తగినట్టుగా మరిన్ని పాత్రలు ఈ కథలో వచ్చి చేరనున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి, అర్జున్ కపూర్ వంటి వారి పేర్లు వినిపించాయి. ఇక తాజాగా కేథరిన్ పేరు తెర పైకి వచ్చింది. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనుందని అంటున్నారు. పుష్ప అంతు చూస్తానంటూ ఆ ఫారెస్టులోకి ఆమె ఎంట్రీ ఇస్తుందని.. ఆమె బాడీ లాంగ్వేజ్ ను కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది.

బన్నీతో కేథరిన్ ఇంతకు ముందు ‘ఇద్దరమ్మాయిలతో’, ‘సరైనోడు’ వంటి సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం కూడా ఆమెను రంగంలోకి దింపనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా భలే ఉందే సినిమా అనేలా కథను పవర్ ఫుల్ గా, ఇంట్రస్టింగ్ గా రాశారట సుకుమార్. బాలీవుడ్ లో అంతగా ప్రచారం చేయకపోయినా పుష్ప 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరి.. పుష్ప 2 ఎంత కలెక్ట్ చేస్తుందో.. ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్