Sunday, September 29, 2024
HomeసినిమాPushpa 2: సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన 'పుష్ప 2'

Pushpa 2: సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ‘పుష్ప 2’

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. టాలీవుడ్ లో కన్నా ఎక్కువుగా బాలీవుడ్ లో బిగ్ సక్సెస్ సాధించడం విశేషం. విదేశాల్లో సైతం పుష్ప మానియా కనిపించింది. దీంతో పుష్ప సీక్వెల్ ‘పుష్ప 2’ ఎప్పుడు అనేది అందరిలో ఆసక్తిని కలిగించింది. అంచనాలకు తగ్గట్టుగా కథ పై చాన్నాళ్లు కసరత్తు చేసి ఫైనల్ గా సెట్స్ పైకి తీసుకువచ్చారు. హైదరాబాద్, వైజాగ్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

అయితే… అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో పుష్ప ఎక్కడ..? అంటూ కథ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. అలాగే ఈ టీజర్ చివరిలో పుష్ప ఎక్కడ ఉన్నాడో కూడా చూపించారు కానీ.. అడవిలోకి ఎందుకు వెళ్లాల్సివచ్చింది..? అసలు ఏమైంది..? అనే ఆసక్తిని అందరిలో క్రియేట్ చేశారు. దీంతో ఈ టీజర్ యూబ్యూబ్ ని షేక్ చేస్తూ దూసుకెళుతుంది. తెలుగుతో పాటుగా, హిందీ, కన్నడ, తమిళ, మళయాల భాషల్లో పుష్ప 2 టీజర్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ వీడియోకి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటి వరకూ ఈ వీడియో 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా 3.3 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారు అనేది ఈ గ్లింప్స్ కి వస్తున్న రెస్పాన్స్ ను చూస్తే ఇట్టే చెప్పొచ్చు.ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్, ఫహద్ ఫజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప సినిమా దాదాపు 400 కోట్లు వసూలు చేసింది. పుష్ప 2 చిత్రం 1000 కోట్లు సాధిస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్